దేశంలో క‌రోనా వ్యాప్తి గ‌త 20 రోజుల్లో మ‌రింత తీవ్ర‌మైంది. స‌గ‌టున రోజుకు 22 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే వ‌చ్చే వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఈ కేసులు మ‌రింత పెరిగిపోతాయ‌ని వైద్య‌శాఖ అంచ‌నా వేస్తోంది. ఇక వ‌చ్చే వేస‌వి నాటికి ఇది మ‌రింత తీవ్ర‌త‌రం కానుంద‌ని అంటున్నారు. వ‌చ్చే వేసవి నాటికి కూడా కరోనాకు ఔషధం కనిపెట్టకపోతే మే నాటికి మ‌న దేశంలోనే కాకుండా, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా క‌రోనా విజృంభించే సూచ‌న‌లు ఉన్నాయి.

 

వ‌చ్చే వేస‌వి నాటికి మొత్తం ప్ర‌పంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ వైర‌స్ భారీన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు పేర్కొన్నారు. 84 దేశాల్లో నిర్వహించిన పరీక్షల సమాచారాన్ని క్రోడీకరించి వారు ఒక నివేదికను తయారుచేశారు. ఈ నివేదిక‌ను బ‌ట్టి చూస్తే వ‌చ్చే యేడాది ఎక్కువుగా వైర‌స్ సోకే దేశాల్లో తొలి స్థానంలో మ‌న దేశం ఉండ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే అంశం.

 

భార‌త్ త‌ర్వాత స్థానాల్లో అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, ఇండోనేషియా, యూకే, నైజీరియా, టర్కీ, ఫ్రాన్స్‌, జర్మనీ ఉన్నాయి. భారత్‌లో రోజూ 2.87 లక్షల మందికి సోకే స్థాయికి కరోనా చేరుకుంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: