దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ప‌ది రోజుల వ‌ర‌కు స‌గ‌టున 10 వేల‌తో ప్రారంభ‌మైన కేసులు వారం రోజులు తిరిగే స‌రికే 24 వేల‌కు చేరుకున్నాయి. ఇప్పుడు రోజుకు 22 వేల‌కు పైగానే కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక మ‌ర‌ణాలు కూడా ప్ర‌తి రోజు స‌రాస‌రీ 400కు పైనే ఉంటున్నాయి. ఇదే ఉధృతి కొన‌సాగితే మ‌న దేశాన్ని క‌రోనా స‌ర్వ‌నాశ‌నం చేసేందుకు ఎంతో టైం ప‌ట్టేలా లేదు. 

 

గ‌త  24 గంటల్లో దేశంలో కొత్తగా 22,752 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 482 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే 5,134మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణకాగా, 224 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,42,417 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకగా, 20,642 మంది మృతిచెందారు సౌత్ టు నార్త్ ఎక్క‌డా తేడా లేకుండా క‌రోనా క‌మ్మేస్తోంది. 

 

ఇక మహరాష్ట్ర తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్ తో పాటు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, త‌మిళ‌నాడులోనూ అదే ప‌రిస్తితి కొన‌సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత క‌ట్ట‌డి చేసినా కూడా కేసులు 20 వేలు దాటేశాయి. ఇక ద‌క్షిణాదిలో క‌ర్నాట‌క‌లో మొత్తం కేసుల సంఖ్య 28,877కి చేరగా.. 470 మంది చనిపోయారు. ఇక తమిళనాడులో కరోనా కేసులు 1.22 లక్షలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా 64 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: