టాలీవుడ్ సినీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన ప్ర‌భాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ రానే వ‌చ్చింది. ప్ర‌భాస్ గ‌త ఐదారేళ్ల‌లో మూడు సినిమాలు మాత్ర‌మే చేశారు. బాహుబ‌లి 1, 2 సినిమాల‌తో పాటు సాహో సినిమా మాత్ర‌మే చేశారు. సాహో సినిమా తెలుగులో ప్లాప్ అయినా బాలీవుడ్‌లో మాత్రం బాగానే ఆడింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ సినిమా కోసం ఆయ‌న అభిమానులే కాకుండా యావ‌త్ టాలీవుడ్ సినీ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

 

ఇక జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. ప్ర‌భాస్ రాయ‌ల్ లుక్‌లో అదిరిపోయారు. ఇక పూజా హెగ్డేను గ‌ట్టిగా వాటేసుకుని ఉన్నాడు. ఓవ‌రాల్‌గా ఈ రొమాంటిక్ లుక్ సోష‌ల్ మీడియాలో దూసుకు పోతోంది. ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే.  

 

ఈ సినిమాను గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. ఇక రాధేశ్యామ్ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ప‌లువురు త‌మ సోష‌ల్ మీడియాలో ఈ లుక్‌ను షేర్ చేస్తుండ‌డంతో దూసుకు పోతోంది. ఏదేమైనా ప్ర‌భాస్ స్టామినా ఏంటో మ‌రోసారి ఈ ఫ‌స్ట్ లుక్ చెప్పింది. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: