ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,608 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 292కు చేరింది. రాష్ట్రంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 11,936 యాక్టివ్ కేసులు ఉండగా 13,194 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 25,422కు చేరింది. లాక్ డౌన్ సడలింపులకు ముందు ఏపీలో తక్కువ కేసులు నమోదు కాగా సడలింపులు అమలు చేసినప్పటి నుండి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: