భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు వాతావరణం కాస్త ఆందోళన కలిగిస్తుంది. చైనా వెనక్కు తగ్గినా సరే  ఆ దేశాన్ని నమ్మడానికి వీలు లేదు అని భారత్ అప్రమత్తంగా ఉండటమే మంచిది అని అంటున్నారు విశ్లేష‌కులు. 1962 యుద్ధం సమయ౦లో ఆ దేశం ఇదే విధంగా వెనక్కు తగ్గి దాడులకు దిగింది అని కాబట్టి భారత ఆర్మీ అప్రమత్తంగా లేదు అంటే మాత్రం ఇబ్బంది వచ్చే సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

 

సరిహద్దుల్లో చైనా ప్రతీ కదలిక కూడా గమనిస్తూ ఉండాలి అని లేదు అంటే మాత్రం చైనాను ఎదుర్కోవడం కష్టం అవుతుంది అని డ్రాగన్ దొంగ దెబ్బలు తీయడంలో ముందు ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.  ఇప్పుడు చైనా వెన‌క్కి వెళ్లింద‌న్న ఏమ‌రు పాటుతో ఉంటే డ్రాగ‌న్ దొంగ దెబ్బ తీసే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో అసుల చైనాను ఎంత మాత్రం న‌మ్మ‌డానికి వీల్లేద‌ని.. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి అని సరిహద్దుల పరిస్థితి తెలుసుకోవాలి అని అంత‌ర్జాతీయంగా కూడా ప‌లు దేశాలు భార‌త్‌ను హెచ్చ‌రిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: