ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు దేశాలు అన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే కరోనా ఇప్పుడు రెండు ఖండాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఆసియ ఖండాలకు మాత్రమే అది పరిమితం అయ్యే  సూచనలు ఉన్నాయి అని నిపుణులు భావిస్తున్నారు.

 

యూర‌ప్‌, ఆఫ్రికా ఖండాల్లో క‌రోనా రోజు రోజుకు త‌గ్గుముఖం ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కరోనా హాట్ స్పాట్ లు గా అమెరికా, ఇండియా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కరోనా కేంద్రాలు గా కీలక నగరాలు ఉండే అవకాశం ఉంది. ఈ లిస్టులో ముంబై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, దేశ రాజ‌ధాని న్యూ ఢిల్లీ పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. ఇక్క‌డ ప్రభుత్వాలు అప్రమత్తం కాలేదు అంటే మాత్రం జరిగే నష్టం ఊహకు కూడా అందే విధంగా ఉండద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: