దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు ఎలా వ్యాప్తి చెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శుక్రవారం అత్యధికంగా 26,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,802 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 475 మంది మరణించారు. ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా మ‌ర‌ణాలు 22 వేల‌కు చేరువ‌లో ఉన్నాయి. ప‌రిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే కేంద్రం మాత్రం కుంటి సాకు లెక్క‌లు చెపుతుండ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని, మ‌ర‌ణాల రేటు కేవ‌లం 2.72 శాతం మాత్ర‌మే అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చెపుతున్నారు. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఓ వైపు మ‌ర‌ణాలు కూడా ఇప్ప‌టికే 22 వేల‌కు అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే చేరుకున్నాయ‌ని.. అన‌ధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉంటుంద‌ని.. ఈ టైంలో కేంద్రం క‌రోనా తీవ్ర‌త త‌గ్గించి చూపేలా ఈ లెక్క‌లు త‌ప్పుగా చూపిస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: