క‌రోనా నేప‌థ్యంలో తిరుమ‌ల వెంక‌న్న ఆల‌యాన్ని మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం శ్రీవారి దర్శనాలు పునరుద్ధరించి నేటికి నెల రోజులు పూర్తి అయ్యింది. జూన్ 11 నుండి ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభించ‌గా నెలరోజుల్లో శ్రీవారిని 2,63,000 మంది భక్తులు శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. జూన్ 11  నుండి  జూలై 10 హుండీ ద్వారా  15 కోట్ల 80 లక్షలు ఆదాయం వచ్చింది. ఇక లక్షమంది పైగా తలనీలాలు సమర్పించారు.

 

కరోనా వైరస్ నివారణకు టిటిడి పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దర్శన క్యూలైన్లలో భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసింది. క్యూలైన్ లో శానిటైజర్లు, లిక్విడ్ ఓజోన్ స్ప్రే ఏర్పాట్లు కూడా చేశారు. ఉద్యోగులలో కరోనా కేసులు నమోదు కావడంతో టీటీడీ మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేయ‌డంతో పాటు రెండువారాలకు ఓసారి షిఫ్ట్ విధానం ప్రవేశ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: