ఈ మద్య సైబర్ నేరగాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు.. వారి చేతుల్లో అమాయకులు దారుణంగా మోసపోతున్నారు. సైబర్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా.. మోసపోయేవారు మోసపోతూనే ఉన్నారు. ఆ మద్య మాస్కులు సరఫరా చేస్తామని ఓ కంపెనీవారు వ్యక్తిని దారుణంగా మోసం చేసిన ఘటన మరువక ముందే మరో వ్యక్తి మాస్కులు ఆన్ లైన్ లో కొనాలని ప్రయత్నించి మోసపోయాడు. కుందన్‌బాగ్‌కు చెందిన జూనస్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌లో మాస్కులు హోల్‌సెల్‌ ధరకు కొనాలని ప్రయత్నించాడు.

 

ఇందుకు ఇంటర్‌నెట్‌లో ఒక వెబ్‌సైట్‌ చూసి.. అందు లో కొనేందుకు సదరు సంస్థ నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడారు.  ఇక పది డబ్బాలు మాస్కులు పంపుతామని ఒక్కో బాక్స్ రూ.30 చొప్పున విక్రయించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ముందుకొచ్చారు. ఇదేదో మంచి బేరం అనుకుని వెంటనే ఒప్పేసుకున్నాడు కుందన్.

 

అడ్వాన్స్‌గా కొంత డబ్బు చెల్లించాలని, టాక్స్‌లని, ఎన్‌ఓసీలు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరిట మొత్తం రూ.6.5  డిపాజిట్ చేశారు. ఈ రకంగా అతని వద్ద లక్షలు గుజరాత్‌ సైబర్‌నేరగాళ్లు స్వాహా చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటం, మాస్కులు పంపించకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: