దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి సంబంధించి చాలా వరకు కఠినం గానే వ్యవహరిస్తున్నారు. ప్ర‌స్తుతం రోజుకు కేసుల సంఖ్య ఏకంగా 27 వేల‌కు వెళ్లిపోయింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ దాదాపుగా ఇప్పుడు కఠిన నిర్ణయాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం చాలా ప్రాంతాల్లో మాట వినే పరిస్థితి కనపడటం లేదు. 

 

ఈ నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. లాక్ డౌన్ ని ఎక్కడ అయితే అమలు చేస్తున్నారో అక్కడ ఖ‌కచ్చితంగా ఇక నుంచి కేంద్ర బలగాల పహారా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎవరు అయినా సరే అనవసరంగా బయటకు వస్తే లాఠీ చార్జ్ కూడా చేసే అంశాన్ని కేంద్రం ఇప్పుడు పరిశీలిస్తుంది. నిబంధ‌న‌లు అతిక్ర‌మించే వారి విషయంలో ఇదే మంచి విధానం అవ‌లంభించాలి అని భావిస్తోంద‌ట కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: