తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ నుండి గంగుల కమలాకర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఎస్కార్ట్ వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఈ ఎస్కార్ట్ వాహనంలో ప్రయాణిస్తున్న కొత్తపల్లి ఎస్ఐకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనలో కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ చేతి బొటన వేలు తెగి పడిపోయింది.


 దీంతో ఎస్సై ఎల్లా గౌడ్ ను  హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనలో డ్రైవర్ కి కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: