ఏపిలో ప్రతిరోజూ కేసులు పెరిగిపోతున్నాయి.  ఒక్కరోజే 17 మందిని బలి తీసుకుని భయాందోళనలు రేపింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 309కి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్కరోజులో ఇంతమంది చనిపోలేదు. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఏపీలో గరిష్టంగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదై షాక్ ఇచ్చాయి.  ఇప్పటివరకూ నమోదైన కేసులలో ఇంత అధిక స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దాదాపు 27 వేల మంది కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలు వృథా అయ్యాయి.

 

క్షేత్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఒంగోలుతో పాటు పొదిలి అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షింబోమని ఆయన హెచ్చరించారు. వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కరోనా టెస్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు.

 

సేకరించిన నమూనాలకు ఐడీ నంబర్లు వేసి, సీల్ చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారని, కనీసం మూత కూడా పెట్టకుండానే ల్యాబ్ లకు పంపుతున్నారని మండిపడ్డారు. సేకరించిన ప్రతి నమూనానూ నిర్ణీత వ్యవధిలోనే ల్యాబ్ లకు చేర్చాలని, ఒక్కో టెస్ట్ కు ప్రభుత్వం రూ. 1,100 వరకూ ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: