తెలంగాణ‌ సీఎం కేసీఆర్ మేనల్లుడైన విజ‌య భాస్క‌ర్ అనే వ్య‌క్తి బ‌ల‌వంతంగా త‌మ ఆస్తి అత‌ని పేరు మీద రాయించుకు న్నారంటూ ఓ వ్యాపార‌వేత్త దంపతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో కూడా క‌ల‌క‌లంగా మారింది. న‌గ‌రానికే చెందిన పాబంది ప్ర‌భాక‌ర్ దంప‌తులు మీడియా సాక్షిగా ఏకంగా కేసీఆర్ మేన‌ళ్లుడిపైనే ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు వ‌రంగా మారింది. కేసీఆర్ మేన‌ళ్లుడు అయిన విజ‌య్ భాస్క‌ర్ రావు ఓ బిల్డర్ తో కలిసి రూ.23 కోట్ల విలువైన‌ ఆస్తిని బలవంతంగా తమ పేరుమీద రాయించుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

 

దీనిపై పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే ఇది ఆస్తికి సంబంధించిన వ్య‌వ‌హారం కావ‌డంతో సెటిల్ చేసుకోవాల‌ని చెపుతూనే త‌న‌పై పోలీసులు అక్ర‌మ కేసులు పెట్టార‌ని పోలీసులు ఆరోపించారు. విజ‌య్ భాస్క‌ర్ రావుతో సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోనందుకు త‌న‌పై అక్ర‌మ కేసులు పెట్టి 45 రోజులు జైలుకు పంపార‌ని పోలీసులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే తన కుటుంబానికి పోలీసుల నుండి , కేసీఆర్ మేనల్లుడు విజయ్ భాస్కర్ రావు నుండి ప్రాణహాని ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ఈ విష‌యం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: