భారత్ - చైనా సరిహద్దుల్లో గ‌త నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న సంగ‌తి తెలిసిందే. 22 రౌండ్ల‌లో జ‌రిగిన చ‌ర్చ‌ల త‌ర్వాత చైనా  కాస్త వెనక్కు తగ్గింది. ఇన్ని రోజుల నుంచి రెచ్చిపోయిన చైనా ఆర్మీ ఇక నుంచి కాస్త  జాగ్రత్తగా   వ్యవహరించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు నిపుణులు. దానికి కారణం చైనాకు కొన్ని మిత్ర దేశాలు దూరమయ్యే అవకాశం ఉండటమే అని అంటున్నారు. చైనా సరిహద్దు తగాదాలు దాదాపు 20 దేశాలతో పెట్టుకుంది. ఇందులో నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్ విష‌యంలో చైనా వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప్ర‌పంచ దేశాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

ఇక చైనాకు మొత్తం 20 దేశాల‌తో స‌రిహ‌ద్దు త‌గాదాలు ఉన్నా అవి భారత్ అంత పెద్ద దేశాలు కాదు. చైనా వ్యాపారంలో భారత్ కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనాకు సంబంధించిన పరికరాలను కూడా చైనా నుంచి తీసుకునే అవకాశం ఉంది.  భారత్ తో తగువు నేపధ్యంలో చైనాతో కొత్త వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. అందుకే ఇక భారత్ విషయంలో కయ్యం వద్దని భావిస్తున్న క్ర‌మ‌క్ర‌మంగా వెన‌క్కు త‌గ్గుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: