తెలంగాణ, ఛత్తీస్ గడ్ లో గత కొంత కాలంగా భద్రతాదళాలు - మావోయిస్టుల మద్య  ఎదురు కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల అడవుల్లో మావోయిస్టులు-పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్‌తో పాటు పలువురు తప్పించు కున్నట్టు సమాచారం. అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మావోయిస్టులు తప్పించుకోగా.. పోలీసులు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. 

 

పోలీసుల కండ్లు గప్పి త‌ప్పించుకు తిరుగుతున్న మావోయిస్టులను ప‌ట్టుకునేందుకు తిర్యాని మండల అడవులను  ప్రత్యేక పోలీసు బలగాలతో గాలింపు చేస్తూ  క్షుణ్ణంగా అణువణువునా జల్లెడ పడుతున్నట్లు కొమురం భీం జిల్లా ఇంచార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. గత కొంత కాలంగా ఇక్కడ మావోయిస్టులు మకాం వేసినట్లుగా తమకు సమాచారం అందిందని.. ఈ నేపథ్యంలోనే కూంబింగ్ చేపట్టామని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: