రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్​ రాహుల్​ (61), క్రిస్​ గేల్​ (53), అర్ధ శతకాలతో రెచ్చిపోయి జట్టుకు రెండో విజయాన్ని అందించారు. చివరి ఓవర్​లో రెండు పరుగులు చేయాల్సిన క్రమంలో పంజాబ్​ సునాయాస విజయం సాధిస్తుంది అని భావిస్తే అంచనాలు తలకిందులయ్యాయి.


ఆర్సీబీ స్పిన్నర్​ చాహల్​ అద్భుతంగా బౌలింగ్​ చేయడం వల్ల మ్యాచ్​ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. తొలి రెండు బంతులు డాట్​ బాల్స్​ పడగా.. మూడో బంతికి గేల్​ సింగిల్​ తీశాడు. ఇక నాలుగో బంతికి రాహుల్​ పరుగు చేయలేక ఐదో బంతికి షాట్​ ఆడి పరిగెత్తాడు. అయితే, గేల్​ పరుగులో వేగం తగ్గడం వల్ల రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్​ సూపర్​ ఓవర్​కు దారి తీస్తుందేమో అనే సందేహం ఏర్పడింది. కానీ, చివరి బంతికి పూరన్​(6) సిక్సర్​ బాదడం వల్ల పంజాబ్​ ఊపిరి పీల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: