ఈట్​ రైట్​ ఇండియా' ఉద్యమ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ఆహార భద్రత నుంచి పోషకాల సంరక్షణ వైపు పయనించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు. ఇతర మంత్రిత్వ శాఖలూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై.. వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కోరారు.ఎఫ్​ఎస్​ఎస్​ఏ, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్​ అధికారులతో మంత్రి హర్షవర్ధన్​ సమావేశమయ్యారు.



 'ఈట్​ రైట్​ ఇండియా ఉద్యమం​'లో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన విజన్​ 2050 అమలు తీరుపై చర్చించారు. దేశంలో సరైన ఆహారంలేని కారణంగా వచ్చే వ్యాధుల వల్లే అయ్యే ఖర్చు రూ.11 లక్షల కోట్లుగా ఉంటుందన్న అంచనాను ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: