కపిల్ దేవ్... అంతర్జాతీయ క్రికెట్ లో ఒక సంచలనం. ఈ తరానికి పెద్దగా తెలియదు గాని కపిల్ దేవ్ అంటే ప్రత్యర్ధి జట్లకు గుండెల్లో రైళ్ళు పరిగెత్తే పరిస్థితి. అంతర్జాతీయ క్రికెట్ ని ఒక ఊపు ఊపాడు. ఆల్ రౌండర్ గా అతని ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక అతని  జీవితంలో నేడు మరువలేని రోజు.

సరిగా ఇదే రోజున... అంటే అక్టోబర్ 16 న 1978 లో అతను టెస్ట్ అరంగేట్రం చేసాడు. గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరిగా కపిల్ నిలిచారు. 5248 టెస్ట్ పరుగులు చేయడమే కాకుండా రికార్డ్ స్థాయిలో 434 టెస్ట్ వికెట్లు తీసుకున్నాడు, ఆ టైం లో ఇది అరుదైన రికార్డ్ గా చెప్తారు క్రికెట్ జనాలు.  కపిల్ కెరీర్ లో ఇండియాకు ప్రపంచకప్ కూడా అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: