విశాఖలో తెన్నేటి పార్క్ సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్ వాణిజ్య నౌక  "ఎంవి మా"ను తిరిగి సముద్రంలోకి తీసుకు వెళ్ళడానికి నానా కష్టాలు పడుతున్నారు అధికారులు. బంగ్లాదేశ్ నౌకను తిరిగి సముద్రంలో తీసుకెళ్లేందుకు ప్రైవేట్ ఏజెన్సీలకు టెండర్లు పిలిచారు. నౌకను సముద్రంలో తీసుకెళ్లేందుకు నౌక యజమాని, లోకల్ ఏజెంట్, పి ఐ క్లబ్, హెచ్ బి భీమాడారు, డీజీ షిప్పింగ్, ఇండియన్ కోస్ట్గార్డ్, పోలీస్, జిల్లా కలెక్టర్, సెక్యూరిటీ పోస్ట్ గార్డ్ లతో సమన్వయం చేసుకోవాలని అధికారులు సూచించారు.

నౌకలో 40 టన్నుల ఇంధనం ఉంది. రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నౌకలో ఉన్నవి అన్ని బయటకు తీయాలిని అధికారులు చెప్తున్నారు. విశాఖలో హెచ్పిసిఎల్, ఐ ఓ సి ల దగ్గర రివర్స్ పంపింగ్ అందుబాటులో ఉండటంతో వాళ్ళని పిలిచిన అధికారులు.... త్వరిత గతిన దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: