రాష్ట్రంలో ప్రధాన మంత్రి అవాస్ యోజన అమలు చేశారా అని ఏపీ హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పీఎంఏవై కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్ని అంటూ కేంద్రాన్ని హైకోర్ట్ ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలు అందించాలని ఏపీ హైకోర్ట్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదు అని రాష్ట్ర ప్రభుత్వం ను ఏపీ హైకోర్ట్ ప్రశ్నించింది.

పీఎంఏవై కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్నో తెలపాలని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. పూర్తి వివరాలతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాగా 84 వేల ఇళ్ళు  లబ్ది దారులకు ఇవ్వడం లేదు అని  హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దానిపై విచారణ జరిగింది హైకోర్ట్ లో.

మరింత సమాచారం తెలుసుకోండి: