బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంటీ అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లను కూడా విచారించారు. అయినా సరే కొన్ని రోజుల నుంచి ఈ విషయంలో ఏ విధమైన ముందు అడుగు  అనేది పడటం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టార్గెట్ గా విచారణ చేస్తున్నారు.

ప్రముఖ నటుడు వివేక్‌ ఒబెరాయ్ ఇంట్లో పోలీసుల సోదాలు  జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి అతని ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ముంబైలోని తన నివాసంలో బెంగుళూరు పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న వివేక్ బావమరిది ఆదిత్య టార్గెట్ గా ఈ కేసు విచారణ జరుగుతుందని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: