సెంట్రల్ కాశ్మీర్‌ లోని బుద్గాం జిల్లాలోని చాదూరా ప్రాంతానికి చెందిన ఆర్మీ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందుగుండు సామగ్రితో పాటు పారిపోయిన శశాస్త్రా సీమా బాల్ (ఎస్‌ఎస్‌బి) జవాన్‌ ను రాజౌరి జిల్లాలో శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎస్‌ ఎస్‌ బి కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ అక్టోబర్ 13 న చాడూరా సమీపంలోని నాగం ప్రాంతంలోని శిబిరం నుండి పారిపోయాడు.

ఐఎన్ఎస్ఎస్ రైఫిల్ మరియు 20 రౌండ్ల బుల్లెట్స్ తో పారిపోయాడు. అతను రాజౌరి జిల్లాలోని కోటారంకా తహసీల్‌ కు చెందిన రెహన్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. మందుగుండు సామగ్రితో అతనిని అదే జిల్లాకు చెందిన పోలీసులు పట్టుకున్నారు. అతనిని పోలీసులు విచారిస్తున్నారు. ఉగ్రవాదులకు ఆయుధాల సహాయం చేస్తున్నాడా అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: