అదిలాబాద్ బిజెపి  ఎంపీ సోయం బాపూ రావు రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 9 లోగా పోడు భూములకు  పట్టాలివ్వాలి అని ఆయన డిమాండ్ చేసారు. లేకుంటే  ఆదివాసులతో కలిసి ఉద్యమిస్తాం అని ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం పట్టాలు ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంపై నెపం మోపుతూ టిఆర్ ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది అని విమర్శించారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో  ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పది వేల కోట్లకు పైగా ఖర్చు చేసి భూములను కొనుగోలు చేసింది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. దీనిపై ఇతర  రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం కూడా ఆసక్తిగా గమనిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: