దాయాది పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూనే ఉంది అని భారత విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ ఆరోపించారు. జాతీయ విధానంగా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వాడుతుందని ఆయన అన్నారు. దీనితో ఆ  దేశంతో సాధారణ సంబంధాలు నిర్వహించడం చాలా కష్టమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం చెప్పారు. ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఎఎస్పిఐ) తో వర్చువల్ ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.

"పాకిస్తాన్ లో ఉగ్రవాదం... తమ ప్రభుత్వం వారు సమర్థించే విధానంగా బహిరంగంగా అంగీకరించారు” అని అన్నారు. ప్రతి అంతర్జాతీయ వేదికల మీద... కాశ్మీర్ మరియు పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) సమస్యను మాట్లాడటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. భారత ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ తో భారత్ ఎప్పటికి దగ్గర కాలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: