విజయవాడ లో దివ్య హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ఇంకా కొన్ని కొన్ని ఆధారాలు పోలీసులకు దొరకలేదు. దివ్య హత్య ఘటనా ప్రాంతంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు... కేసుని దిశా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసారు. దివ్య తల్లిదండ్రులను విచారిస్తున్నారు పోలీసులు. నిందితుడు నాగేంద్ర బాబు వాంగ్మూలం నేపథ్యంలో దివ్య తల్లిదండ్రులను  మాచవరం పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు.

దివ్య, నాగేంద్ర బాబు రహస్య ప్రేమ వివాహంపై దివ్య తల్లిదండ్రులను ప్రశ్నిస్తున్న పోలీసులకు వారి వివాహానికి సంబంధించి ఇంకా అధికార ధృవీకరణ పత్రం దొరకలేదు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దివ్య కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు. దివ్య హత్య కేసులో  మిస్టరీ అలాగే ఉంది. దివ్య విడుదల చేసిన వీడియో కూడా ఒకటి సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: