టీడీపీ ఎమ్మెల్యేకి విశాఖలో పోలీసులు షాక్ ఇచ్చారు. త్రీ టౌన్ సమీపంలో, ఇంజనీరింగ్ రోడ్డు పక్క నిర్మించిన షాపులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా  జివిఎంసి అధికారులు  తొలగించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ నిరసన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే ని అక్కడి నుండి పక్కకు తప్పించారు స్థానిక పోలీసులు. ఆయనను అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళారు.

దీనితో ఆయన మాట్లాడుతూ విమర్శలు చేసారు. ఆ స్థలం జల వనరుల శాఖ చెందినదని, ఈ స్థలం వల్ల ఎవరికీ అడ్డం  లేదు అని ఆయన అన్నారు. సుమారుగా నలభై ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నారని అన్నారు. గతంలో జలవనరుల శాఖ అనుమతితోనే వీటి నిర్మించాం అని చెప్పారు. రాజకీయంగా నా మీద కక్ష సాధించేందుకు , పేద ప్రజల కొట్టడం  సరైంది కాదని అయన ఆరోపించారు. నాపై కక్ష సాధించాలనుకుంటే ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: