పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్​. ఈ మేరకు.. పార్టీలో అంతర్గత సంస్కరణల ప్రక్రియను కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల అథారిటీ(సీఈఏ)ప్రారంభించింది.కాంగ్రెస్​లో అంతర్గత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు.. ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి, 2021 నాటికి ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని సీఈఏ సభ్యుడు ఒకరు తెలిపారు.


నవంబర్​ కల్లా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేయాలని సీఈఏ నిర్ణయించింది. కాంగ్రెస్​ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి లభించగానే.. ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్​. త్వరలోనే ఈ ఎన్నికల ప్రక్రియపై.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుూసీ) సమావేశం జరగనుంది.కాంగ్రెస్​ మాజీ ఎంపీ మధుసూదన్‌ మిస్త్రీ.. ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న సీఈఏ బుధవారం సమావేశమైంది. సీఈఏ సభ్యులు.. కృష్ణ బైరేగౌడ, ఎస్​.జ్యోతిమణి , అర్విందర్‌ సింగ్‌ లవ్లీలు ఈ భేటీలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: