కరోనా నిబంధనల నడుమ మైసూర్​లో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పండుగగా ప్రతిఏటా 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలపై ఈ సారి కొవిడ్​ ప్రభావం పడింది. అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.410వ దసరా ఉత్సవాలను నిరాడంబరంగా, సంప్రదాయాలను పాటించేలా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో రాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా జానపద కళలను ప్రదర్శిస్తారు.


ఈనెల 26వ తేదీన విజయ దశమి ( వేడుకల 10వరోజు) చాముండేశ్వరి అమ్మవారి జంబో సవారీ (ఏనుగుపై ఊరేగింపు) నిర్వహిస్తారు. ప్రతిఏటా అత్యంత వైభంగా.. లక్షల మంది ప్రజల సమక్షంలో ఈ ఊరేగింపు జరుగుతంది. మైసూర్​ ప్యాలస్​లోనూ దసరా ఉత్సవాలు నిర్వహించాలని రాజకుటుంబం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో ఎంపిక చేసిన వారి సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: