బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్​ 23 నుంచి పాల్గొననున్నారు. ఆ రోజు రెండు సభల్లో ఆయన మాట్లాడనున్నారు. హిసువాలో కాంగ్రెస్ అభ్యర్థి నీతూ సింగ్ ‌తరఫున రాహుల్ ప్రచారం చేస్తారు.భూమిహార్ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమిహార్ సమాజం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. చాలా కాలం తర్వాత పార్టీకి ఈ స్థాయిలో సీట్లు రావడం ఇదే తొలిసారి.



భూమిహార్ సామాజికవర్గానికి పార్టీ సందేశాన్ని అందజేసేందుకు వీలుగా కహల్‌గావ్‌లో మరో సభ నిర్వహించనుంది కాంగ్రెస్. సీఎల్‌పీ నాయకుడు సదానంద్ సింగ్ కుమారుడు ముకేశ్ సింగ్ పోటీ చేస్తున్నారు. 9 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా సదానంద్ సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ముకేష్ పోటీ చేస్తున్నారు.ఆర్​జేడీ నేత తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఆ తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. బిహార్ ఎన్నికల్లో ఒక్కో దశలో రెండు ర్యాలీల చొప్పున మొత్తం 6 ర్యాలీల్లో రాహుల్ పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: