వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సామరస్యం పూర్తిగా దెబ్బతిన్నాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఇది భారత్, చైనా మధ్య సంబంధాలను పూర్తిగా ప్రభావితం చేస్తోందని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను ఉద్దేశించి జైశంకర్​ ఈ మేరకు వ్యాఖ్యానించారు.ఓ పుస్తకావిష్కరణకు సంబంధించిన వెబినార్​లో పాల్గొన్న జైశంకర్​.. భారత్, చైనా సరిహద్దు అంశంపై మాట్లాడారు.


భారత్, చైనా సరిహద్దు అనేది చాలా క్లిష్టమైన అంశం. 1980ల్లో శాంతి నెలకొన్న మాట వాస్తవమే. కానీ.. ఇప్పుడు వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ఇది అన్ని రకాల సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయంగా ముఖ్య పాత్ర పోషించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. కానీ, రెండు దేశాల మధ్య సమన్వయం ఎలా అన్నది ప్రశ్నగానే మిగిలింది అని  జైశంకర్ అన్నారు.చైనా ఎదుగుదలను మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు జైశంకర్​. అయితే, మనది చైనా కాదని గుర్తుంచుకోవాలన్నారు. విధానాలు, రాజకీయాలు, ప్రభుత్వాల స్వభావాల రీత్యా రెండు భిన్న దేశాలని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: