మహారాష్ట్ర లో విద్యార్ధుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై మునిసిపల్ కార్పోరేషన్...  ప్రైవేట్ ఉర్దూ టీచర్స్ యూనియన్ 1-10 తరగతి విద్యార్థుల కోసం ఇమామ్వాడ ప్రాంతంలో ఉచిత మొబైల్ ఫోన్ లైబ్రరీని ప్రారంభించింది. ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులు, మొబైల్ ఫోన్ కొనలేని వారు ఇప్పుడు ఇక్కడ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు.

సెంటర్ ఇన్‌ఛార్జ్  శాహీనా సయూద్ మాట్లాడుతూ... ఈ క్లాస్ లో ఇప్పటివరకు 22 మంది విద్యార్థులు చేరారని చెప్పారు. కొంతమంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు లేవు లేదా వారి కుటుంబంలో ఒకే మొబైల్ ఫోన్ మాత్రమే ఉందని చెప్పారు. కాబట్టి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వారు ఆన్‌ లైన్‌ లో క్లాసులు వింటున్నారు అని, సిలబస్ పూర్తవుతోందని అన్నారు.  ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: