హైదరాబాద్ లో భారీ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గాయి అనుకున్న వర్షాలు మళ్ళీ రావడంతో అక్కడి ప్రజలు హైదరాబాద్ లో ఉండాలి అంటే కంగారు పడే పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం. దాదాపుగా లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా మళ్ళీ  ఇబ్బంది పడుతున్నాయి. అయితే పాత బస్తీ లో మాత్రం కొన్ని ప్రాంతాలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. తొలీ చౌకీ సహా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

ఇక వరదల్లో ఇబ్బంది పడుతున్న వారు చర్మ వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. నేడు రేపు భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో వరదలకు సంబంధించి ఇప్పుడు ఒక వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇది  ఎక్కువగా షేర్ చేస్తున్నారు. జాతీయ మీడియా కూడా షేర్ చేస్తుంది. వరద తీవ్రత ఏ రేంజ్ లో ఉందో పాత బస్తీ లో ఈ వీడియో చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: