భారత్ లో కరోనా పరిక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కరోనా పరీక్షలను చాలా వేగంగా పెంచుతుంది కేంద్రం.  ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా పరిక్షల సామర్ధ్యం  పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక పాజిటివిటి రేట్ కూడా మన దేశంలో క్రమంగా తగ్గుతుంది. తాజాగా కేంద్రం ఒక లెక్క విడుదల చేసింది.

భారతదేశం తన పరీక్షా సామర్థ్యాన్ని జనవరిలో ఒకటి నుండి ప్రస్తుతం 9.32 కోట్లకు పెంచింది అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పాజిటివ్ రేట్ క్రమంగా తగ్గుతుందని... ఇది ఇప్పుడు 8% కంటే తక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.  ఇక మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. ప్రపంచం లోనే ఇండియా టాప్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: