హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాత్రి పడిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది.  ఇక రోడ్డు మార్గాలు కూడా హైదరాబాద్ లో చాలా దెబ్బ తిన్నాయని   అధికారులు చెప్తున్నారు.  ఇప్పుడు ఇంకా వర్షం పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువు వద్ద హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఫ్లై ఓవర్ నిర్మాణానికి తీసిన పిల్లర్ గుంతలో పడి ఇరుక్కపోయిన డీసీఎం వాహనం బయటకు రావడం లేదు. దీనితో జీహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగారు. ఈ పరిణామంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది అని అధికారులు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: