తెలంగాణా రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి ఒక ఘనత సాధించారు. ఆయన పోలీసింగ్ మీద పీహెచ్‌డీ పూర్తి చేశారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్‌డీ పట్టాను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి హాజరు కాగా ఆయన చేతుల మీదుగా మహేందర్‌రెడ్డి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ ఆన్‌ లైన్‌ ద్వారా అధ్యక్ష ఉపన్యాసం కూడా చేసారు.

ఆ తర్వాత డీజీపీ మాట్లాడుతూ... ‘‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఇనర్మేషన్‌ టెక్నాలజీ ఆన్‌ పోలిసింగ్‌’’ అనే సబ్జెక్టు మీద తనకు పీహెచ్‌డీ రావడం ఆనందంగా ఉంది. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగంపై నేను గత పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నా. తన పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు. నా పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా” అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: