హైదరాబాద్ లో భారీ వర్షం పడటంతో అధికారులు చాలా వరకు అప్రమత్తం అయ్యారు. హిమాయత్ సాగర్  2 గేట్లను ముందు ఓపెన్ చేసిన అధికారులు... దిగువకు నీటిని విడుదల చేసారు. వరద ఉధృతి రావడం వలన హిమాయత్ సాగర్ జలాశయం గేట్లను జల మండలి అధికారులు మరో 2 గేట్ లను పైకి లేపారు.  హిమాయత్ సాగర్ చెరువు సాయంత్రం వరకు కేవలం 2 గేట్ మాత్రమే ఓపెన్ చేశారు.

నిన్న సాయంత్రం నుండి ఎడతెరిపి గా కురుస్తున్న వర్షానికి మరో రెండు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేసారు.  4 గేట్లు 2 ఫీట్ల మేర కు ఎత్తి  నీటిని  దిగువ ప్రాంతాలకు వదిలారు. దీనితో లోతట్టు మరియు మూసి పరివాహిక ప్రాంత ప్రజలు అప్రమతంగా ఉండటం మంచిది అని పోలీసులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: