తెలంగాణాలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు చాలా వరకు తగ్గుతున్నాయి.  నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇవాళ్టి వరకు వచ్చిన దరఖాస్తులు  20.35 లక్షలు అని అధికారులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల నుంచి 8 లక్షల 44 వేల ఎల్ఆర్ ఎస్ దరఖాస్తులు వచ్చాయి. పురపాలక సంఘాల నుంచి 8 లక్షల 47 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.

నగర పాలక సంస్థల నుంచి 3 లక్షల 43 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ గడువుని ఈ నెల 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: