ఏపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించింది. 56 బిసి కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రభుత్వం ప్రకటించింది. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. 30 వేల పైబడి జనాభా కలిగిన బిసి కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం  కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం. పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

పురుషులు కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌ పదవులు ఇచ్చారు. 56 చైర్మన్ పోస్టుల్లో  29 మంది మహిళలు, 27 మంది పురుషులకు ఛైర్మన్‌ పదువులు ఇచ్చారు. 728  డైరెక్టర్ల పదవుల్లో 364 డైరెక్టర్లు గా  మహిళలకు అవకాశం కల్పించారు. ఛైర్మన్‌, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిథ్యం కల్పించారు. మోపిదేవి వెంకటరమణతో పాటుగా పలువురు మంత్రులు పదవులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: