భారతదేశంలో యాక్టివ్ కేసులు  క్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా రెండో రోజు ఎనిమిది లక్షల కన్నా తక్కువగా ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో 10.45 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  దేశంలో కరోనా రికవరీ రేటు 88.03 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు చండీగడ్ లో కరోనా కేసులు  భారీగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా రికవరీ రేటు చాల వేగంగా పెరిగింది. 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000 కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఛత్తీస్‌గర్ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 72,614 కరోనావైరస్ రోగులు ఒక రోజులో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: