తెలంగాణా ప్రజలు కరోనా నేపధ్యంలో బతుకమ్మ పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్. శ్రీనివాస్ తెలిపారు. వరుసగా పండుగ వాతావరణ కోలాహలం మొదలయ్యిందని, మనందరికీ రాబోయే 3 నెలలు చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. జన సమూహాల్లో వైరస్ అటాక్ చేస్తుంది అని హెచ్చరించారు. 70 శాత పైగా  కరోనా కేసులు ఎలాంటి లక్షణాలు లేనివి అని తెలిపారు.

పండుగలను కుటుంబసభ్యుల మధ్య జరుపుకోండని సూచించారు. కేరళ లో ఓనమ్ ఫెస్టివల్ తర్వాత  కేసులు గణనీయంగా నమోదయ్యాయని అన్నారు. ఢిల్లీ లోను కేసులు ఎక్కువయ్యాయని, యూకే, జర్మనీ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువవుతోందని పేర్కొన్నారు. కారణం ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరగడమే అని సూచించారు. బతుకమ్మ పండుగను జాగ్రత్తలతో జరుపుకోండన్నారు. చలి కాలంలో ఏ వైరస్ అయిన విజృంభిస్తుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: