బీటెక్ స్టూడెంట్ దివ్యతేజస్విని హత్య కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులకు అంతుబట్టని విధంగా పలు మలుపులు తిరుగుతున్న కేసులో ఇప్పటి వరకు ఏ అంశంలో కూడా క్లారిటీ రాలేదు . నిందితుడు నాగేంద్రబాబు చెప్పినదానికి, దివ్యతేజస్విని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోకి వ్యత్యాసం ఉంది. దివ్యతేజస్విని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో నాగేంద్రబాబు టార్చర్ పై దివ్యతేజస్విని ఆవేదన వ్యక్తం చేసింది. దివ్య తేజస్వినికి క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్, ఇన్ స్ట్రాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ ద్వారా పలు వివరాలు సేకరిస్తున్న పోలీసులు... వారిని విచారించే అవకాశం ఉంది. దివ్యతేజస్విని, నాగేంద్రబాబు మధ్య తలెత్తిన విభేదాల అనంతరం నాగేంద్రబాబుతో దివ్య ఫ్రెండ్స్ ఎవరెవరు బాగా సన్నిహితంగా మెలిగారో పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశానికి దగ్గర లో నాగేంద్రబాబుతో పాటు అతని స్నేహితులు ఇంకేవరైనా ఉన్నారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: