సంగారెడ్డి జిల్లా బీరం గుడా ఇసుక బావి వాగులో తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభ్యం అయింది. వారం రోజుల క్రితం కార్ తో పాటు వరద నీటి లో కొట్టుకుపోయిన  ఆనంద్ కోసం ప్రభుత్వ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. గజ ఈతగాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్  టీమ్స్ తో గాలింపు చేపట్టినా సరే అతని ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దాదాపు 15 కిలోమీటర్ల మేర ఆ వాగు ఉంది.

 ఇక ఇదిలా ఉంటే అతని  కారుని చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన మత్స్య కారులు గుర్తించారు. కార్ తో పాటు ఆనంద్ మృత దేహాన్ని ఒడ్డుకు చేర్చారు స్థానిక అధికారులు. ఎక్కడ అయితే కారు తప్పి పోయిందో అక్కడి నుంచి 2 వందల మీటర్ల వరకు వచ్చి భూమిలోకి కుంగిపోయింది కారు. గత 6 రోజుల ప్రవాహం లొనే కార్ ఉన్నట్టు గుర్తించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: