గత వారం బల్లియాలో బహిరంగంగా ఒక వ్యక్తిని కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడుని గట్టిగా సమర్థిస్తున్న ఉత్తరప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే నుంచి పార్టీ అధిష్టానం వివరణ కోరింది. బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ప్రవర్తనపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హెచ్చరించారు అని అంటున్నారు. అధికారులు, పోలీసుల సమక్షంలో పంచాయతీ సమావేశంలో గ్రామస్తుడిని కాల్చి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు అని సమాచారం. కాల్చి చంపిన వ్యక్తిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బల్లియాకు చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ నిందితుడు నేరం చేయలేదు అని ఆత్మరక్షణ కోసం కాల్చి చంపాడు అని పోలీసులకు చెప్తున్నారు. మీడియా ముందు కూడా అవే వ్యాఖ్యలు చేసారు.  దీనితో బిజెపి అధిష్టానం ఇప్పుడు ఎమ్మెల్యేని అవసరం అయితే ఢిల్లీ కూడా పిలిచి వార్నింగ్ ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: