మధ్యప్రదేశ్​ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్​ సీనియర్​ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​​ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్​ తరఫున ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్​నాథ్​.. బిజేపి మహిళా అభ్యర్థి ఇమార్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలే సమయానికి ఇమార్తీ దేవి రాష్ట్ర కేబినెట్​ మంత్రిగా ఉన్నారు. అనంతరం బిజేపి గూటికి చేరి తాజాగా ఉపఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దేవి కాంగ్రెస్​కు ద్రోహం చేశారని.. ఆమె వ్యవహారం తనకు ముందు తెలియదని పేర్కొన్నారు కమల్​నాథ్​. ఈ నేపథ్యంలోనే పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు​.


కమల్​నాథ్​ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇమార్తీ దేవి. ఆయన్ను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్​ చేశారు.కమల్​నాథ్​ను ఇన్నేళ్లు సోదరుడిగా భావించానని... కానీ ఆయన తనను అగౌరపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఇమార్తీ దేవి. నిజానికి జ్యోతిరాదిత్య సింధియా వల్లే తాను కేబినెట్​ మంత్రి పదవి చేపట్టానని.. కమల్​నాథ్​ తనను చిన్నచూపు చూసేవారని ఆరోపించారు. కమల్​నాథ్​ వంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని బిజేపి ను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: