ఈ దశాబ్దాన్ని భారత్‌ దశాబ్దంగా మార్చేందుకు దేశంలోని అన్ని రంగాల్లో ఏకకాలంలో సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడచిన ఆరేడు మాసాలుగా.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమైనట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానం(ఎన్​ఈపీ) భారత్‌ను ఉన్నత విద్యలో ప్రపంచానికే కేంద్ర బిందువుగా మార్చేందుకు తీసుకొచ్చిన పెద్ద సంస్కరణగా మోదీ పేర్కొన్నారు.కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం శతవార్షిక స్నాతకోత్సవం-2020లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వర్షాలు, కరోనా మహమ్మారి నడుమ జరుగుతున్నప్పటికీ స్నాతకోత్సవ స్ఫూర్తి మాత్రం తగ్గలేదన్నారు.


జాతీయ విద్యా విధానం అనేది దేశంలోని ప్రీనర్సరీ నుంచి పీహెచ్‌డీ వరకు పూర్తి విద్యావ్యవస్థలో ప్రాథమికమైన మార్పులు తీసుకొచ్చేందుకు తెచ్చిన అద్భుతమైన విధానమన్నారు మోదీ. యువత అన్ని రంగాల్లో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు బహుముఖ విధానాల్లో ముందుకు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగాన్ని బట్టి మన యువత వేగంగా వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, అందిపుచ్చుకోవడం, మార్చుకోవడం, పదును పెట్టుకోవడం ఇప్పుడు అత్యావశ్యకమని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: