పశ్చిమ్​ బంగాలో విజయదశమి వేడుకలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఆ రాష్ట్రంలో దుర్గామాత పూజలు నిర్వహిస్తారు. ఈసారి కరోనా కారణంగా ఆంక్షల నడుమే పండుగను జరుపుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోల్​కతాలోని దుర్గా పూజా కమిటీ వినూత్న ఆలోచనతో విగ్రహాన్ని రూపొందించింది. దుర్గామాత వైద్యురాలి అవతారమెత్తి కరోనా వైరస్ అంతమొందించే ఇతివృత్తంతో దీన్ని తయారు చేశారు.


ఈ విగ్రహాన్ని చూసి ముగ్ధులైపోయారు కాంగ్రెస్ నేత శశిథరూర్​. సృజనాత్మకతతో రూపొంచిందిన దుర్గామాత విగ్రహం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. దీన్ని తయారు చేసిన రూపకర్త, శిల్పికి సెల్యూట్ చేస్తున్నట్లు ట్వీట్​ చేశారు.బంగాల్​లో ఈనెల 22నుంచి విజయదశమి వేడుకలు ప్రారంభంకానున్నాయి. కరోనా నేపథ్యంలో దుర్గామాత మండపాల్లో ఈసారి సందర్శకులకు అనుమతి లేదని కోల్​కతా హైకోర్టు సోమవారం తెలిపింది. పెద్ద మండపాల్లో 25మంది, చిన్న మండపాల్లో 15మంది నిర్వాహకులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: