పండుగ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. అక్టోబర్ 20 (నేటి) నుంచి నవంబర్ 30 మధ్య మొత్తం 196 రూట్లలో 392 రైలు సర్వీసులను నడపనుంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు ఇవి అదనం.దసరా నవరాత్రులతో పాటు దీపావళి, ఉత్తరాదిన ప్రత్యేకంగా జరిగే ఛఠ్ పూజ లాంటి పండుగలు వరుసగా ఉన్న కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంతో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే తెలిపింది. అయితే, ఈ రైళ్ల టికెట్ ధరలు.. తరగతులను అనుసరించి 10 నుంచి 30 శాతం పెంచనుంది.


కరోనా నేపథ్యంలో స్టేషన్లు, రైళ్లలో తీసుకోవాల్సిన చర్యలు, భద్రత వంటి అంశాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ గతవారంలో సమీక్ష నిర్వహించారు.కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో మార్చి చివరివారంలో రైలు సేవలను నిలిపేశారు. అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి క్రమంగా రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 682 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: