భాగ్యనగరంలో భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్ లో పరామర్శించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజల్లో ధైర్యం నింపారు. ఇళ్లలోకి వరదనీరు ప్రవహించి ఇబ్బందులు పడుతున్న ప్రజలతో నేరుగా మాట్లాడి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.


భారీ వర్షాలతో మంగళహాట్ ప్రాంతంలో ఆరేళ్ల పాపని కోల్పోయిన మహమ్మద్ ఇమ్రాన్​ను పరామర్శించారు. గగన్​పహాడ్​లో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మునీర్​ఖాన్​తో ఫోన్ లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆపద సమయంలో కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు చేతులు సబ్బుతో కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. పలు కాలనీల్లో ప్రజలతో మాట్లాడి, వారి పరిస్థితిపై దత్తాత్రేయ అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: