ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో మొదటి సంవత్సరం తరగతులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రియ తుది గడువును కూడా నవంబర్​ 30 వరకు పొడిగించింది.ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నాయి.


 వీటితోపాటు పలు రాష్ట్రాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీటీఈ కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.తొలుత సెప్టెంబర్​లో అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఏఐసీటీఈ.. నవంబర్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రారంభించాలని సూచించింది. అక్టోబర్ 31 వరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తవ్వాలని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ గడువును ప్రస్తుతం పొడిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: