శాస్త్ర, ఆవిష్కరణ రంగాల్లో పెట్టుబడి పెట్టే సమాజాలే భవిష్యత్తును తీర్చిదిద్దుతుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముందస్తుగా ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సరైన సమయంలో ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం ప్రారంభోత్సవంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు మోదీ.భారత్​లో పటిష్ఠ, సమర్థమంతమైన శాస్త్రీయ రంగం ఉందని మోదీ పేర్కొన్నారు. దేశానికి తలమానికమైన శాస్త్రీయ సంస్థలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.


ముఖ్యంగా కరోనాతో పోరాడుతున్న సమయంలో భారత్​కు ఇవన్నీ గొప్ప ఆస్తులని అన్నారు. కరోనా నియంత్రణ నుంచి సామర్థ్యం పెంపు వరకు ఈ సంస్థలు అద్భుతాలు చేశాయని కొనియాడారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగుతున్న ఈ సమావేశంలో.. విధానకర్తలు, శాస్త్రవేత్తలు భాగస్వామ్యం కానున్నారు. ఈ వార్షిక సమావేశాన్ని బిల్​ అండ్ మెలిండా గేట్స్​ ఫౌండేషన్​, శాస్త్ర సాంకేతిక శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్​, గ్రాండ్ ఛాలెంజెస్ కెనడా, యునైటెడ్​ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్​మెంట్ అండ్ వెల్​కం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: